పోలీసు స్పందనకు 135 ఫిర్యాదులు
1 min read– విచారణ జరిపి చట్ట పరిదిలో న్యాయం చేస్తాం
– జిల్లా ఎస్పీ. శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ( 30-10-2023 ) నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదిదారుల నుంచి నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS 135 ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండీ విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ,స్పందన ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ,స్పందన పిర్యదుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు.
ఫిర్యాదులలో కొన్ని ……..
1) పల్లె.రమేష్ అయిన నేను మరియు జింకల.మల్లికార్జున ఇద్దరం కలిసి 9 లక్షలతో 2021 లో నంద్యాల టౌన్ దేవనగర్ నందు అక్షర E.M స్కూల్ స్థాపించడం జరిగింది.ప్రస్తుతం స్కూల్ బాగా అభివృద్ది చెందడంతో మల్లికార్జునకు స్వార్థం పెరిగి నాకు రావసిన ఆదాయంలో వాటా ఇవ్వకుండా తప్పుడు బిల్లులు చూపిస్తూ వాటా అడిగితే ఇవ్వకుండా మోసం చేస్తూ బెదిరిస్తూన్నాడని నాకు న్యాయం చెయ్యందని నంద్యాల టౌన్ కు చెందిన పల్లె.రమేష్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
2) నంద్యాల టౌన్ కోటా వీది నందు ఉన్న నా స్వంత ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించుకొన్నదని నాకు న్యాయం చేయండి అని నంద్యాల టౌన్ కు చెందిన R.విజయన్న జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేశారు.
3) నాకు ప్రభుత్వ ఉధ్యోగం ఇప్పిస్తానని 2016 లో రాజు అనే వ్యక్తి నా వద్ద నుండి 03 లక్షలు డబ్బులు తీసుకొని ఇప్పటివరకు డబ్బులు ఇవ్వకుండా ఉద్యోగం ఇప్పించకుండ మోసం చేశాడని నాకు న్యాయం చేయండి అని K.సుధాకర్ నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
4) మేము 2022 సంవత్సరంలో ముడిగేడు గ్రామ నివాసి అయిన శనగల వ్యాపారస్తుడు శేషయ్య కు 24 బస్తాలు అమ్మగా 40,000/- బాకీ పడినాడు మేము ఎన్ని సారు అడిగిన ఇవ్వకపోగా మమ్మల్ని బెదిరిస్తున్నాడని సంజాముల మండలం పెరుసోముల గ్రామానికి చెందిన D.మాబూసా మరియు D.బాలయ్య జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
నంద్యాల జిల్లా ఎస్పీ స్పందకు వచ్చిన ఫిర్యాదిదారులకు ఓంకారం ధేవస్థానం వారిచే భోజన వసతి ఏర్పాటు చేసినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ G.వెంకట రాముడు , స్పెషల్ బ్రాంచ్ DSP జె.వి సంతోష్ , CI సూర్యమౌళి SI లు రాకేష్ మరియు నరేష్ పాల్గొన్నారు.