మౌలానా అబుల్ కలాం ఆజాద్ 135వ జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండలం ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 135వ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పంతుల 1988 నవంబర్ 11న మక్కా లో జన్మించారు. భారతదేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యత చేపట్టారు. దేశంలో ఉన్న చరిత్రక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యాంశాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించారు మౌలానా అబుల్ కలాం ఆజాద్. దేశ స్వాతంత్రం కోసం గాంధీజీ నెహ్రూ వారు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం శాసనోళ్లగణం ఉప్పు సత్యాగ్రహం కిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అనేక సంవత్సరాలు కారాగార శిక్ష అనుభవించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీకి 1920 నుండి 1946 వరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. భారత ప్రభుత్వం 1992లో అత్యున్నత పురస్కారం భారతరత్న పురస్కారంతో గౌరవించింది. ఆయన జన్మదినం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం గా కూడా ప్రకటించింది. ఈ విధంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కి భారత జాతి తన గౌరవాన్ని చాటుకుంది ఆ మహనీయునికి ఆత్మ శాంతి బాగా కలగాలని కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పీరా సాబ్. హెచ్ పరసప్ప. ముస్తఫా. డ్రైవర్ మౌలా.. ఎరుకుల బసవరాజ. చాకలి వెంకటేష్. బోయ మల్లయ్య. సిద్ధమల్ల. రాజన్న. అతని. హరిజన బాబు. ఎం ఖలీల్. తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొని మౌలానా అబుల్ కలాం జయంతిని సంతోషంగా జరుపుకోవడం జరిగింది.