మిలిటెంట్లు గా భావించి కాల్పులు.. 14 మంది పౌరులు మృతి !
1 min readపల్లెవెలుగు వెబ్: నాగాలాండ్ లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆర్మీ జవాన్లు సాధారణ పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 14 మంది పౌరులు మృతి చెందారు. నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓటింగ్ గ్రామ పరిధిలో అస్సాం రైఫిల్స్ దళాలు.. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎన్‌ఎస్‌సిఎన్(కె) ఆంగ్, ఉల్ఫా కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో బస్సులో ఉన్న వారిని మిలిటెంట్లనుకొని కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులు ఘటన వెలుగులోకి రావడంతో పెద్ద ఎత్తున గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. తమ వారు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. వెంటనే అక్కడే ఉన్న భద్రతా సిబ్బందిపై, వారి వాహనాలపై దాడి చేశారు. ఈ దాడుల్లో ఒక జవాను మృతి చెందారు. వెంటనే పెద్ద ఎత్తున ఆర్మీబలగాలు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చాయి.