వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్
1 min read
పల్లెవెలుగువెబ్ : పాల్వంచ రామకృష్ణ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వనమా రాఘవను భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవ ఎ-2 నిందితుడిగా ఉన్నారు. నిన్న వనమా రాఘవను అదుపులోకి తీసుకున్న పోలీసులు .. ఈరోజు మేజిస్ట్రేట్ ముందు హాజరపరిచారు. ఈ ఘటనలో వనమా రాఘవతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు రాఘవను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు.