14వ లోకల్ ఏరియా డెవలప్మెంట్ కమిటీ సమావేశం
1 min readమెగా సోలార్ పవర్ కార్పొరేషన్ అభివృద్ధి పనుల నిధుల ఖర్చు వివరాలు సమగ్రంగా వెంటనే సమర్పించండి…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మెగా సోలార్ పవర్ కార్పొరేషన్ 14వ లోకల్ ఏరియా డెవలప్మెంట్ కమిటీ కొనసాగింపు సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజనకర్నూలు, జనవరి -30:- మెగా సోలార్ పార్క్ ఏరియా గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల ఖర్చుల వివరాలు వెంటనే తెలియజేయవలసిందిగా , దానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు.మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని మినీ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ మెగా సోలార్ పార్క్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ కమిటీ 14 వ సమావేశము యొక్క కొనసాగింపు సమావేశం ను నిర్వహించారు. ఈ సమావేశంలో పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి తో కలిసి మెగా సోలార్ విద్యుత్ సంస్థ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల పనుల ఖర్చులను సమీక్షించారు.మెగా సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా నంద్యాల జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులకు మరియు కర్నూలు జిల్లా కు సంబంధించిన ఖర్చు వివరాలు తెలియవలసి ఉన్నదని , ఆ వివరాలు పదిహేను రోజుల లోపల వచ్చే అవకాశం ఉన్నందున ఈ 14వ సమావేశాన్ని మరొకసారి పొడిగించుకొని సమావేశం ఏర్పాటు చేసుకుని ఖర్చుల వివరాలు అందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించినారు.ఆ తరువాత ఇంకా జరగ వలసిన అభివృద్ధి పనుల గురించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రీన్ కో , ఆదాని కంపెనీల వార్షిక టర్నోవర్ ప్రకారం 2017-18 సంవత్సరము నుండి 2023 వరకు సామాజిక బాధ్యతలో భాగంగా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాల పనులు …..న్యాచురల్ ఫార్మింగ్ , స్వచ్ఛభారత్ పనులు , కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు , బట్టమేక పక్షుల పరిరక్షణ నిమిత్తం ఫెన్సింగ్ , క్రీడా ప్రాంగణాల అభివృద్ధి ,తాగునీటి వసతి , హంద్రీనీవా కాలువ పరిశుభ్రపరచడం తదితర కార్యక్రమాలకు వినియోగించినట్లుగా కలెక్టర్ కి నివేదిక సమర్పించినారు.ఈ సమావేశానికి పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి , సిపిఓ హిమ ప్రభాకర్ రాజు,పంచాయతీరాజ్ ఎస్ ఈ సుబ్రహ్మణ్యం , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మద్దన్న , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , ఏ పి ఎస్ ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, సోలార్ పవర్ కార్పొరేషన్ ఇంజనీర్ ఆంజనేయులు, నాగరాజు , గ్రీన్కో ఏజీఎం చెంచయ్య, డిప్యూటీ మేనేజర్ శివకుమార్ ,సీనియర్ మేనేజర్ రవికుమార్ , కాంట్రాక్టర్లు మేఘనాథ్ రెడ్డి , శివానందరెడ్డి మరియు శకునాల గ్రామం , గని గ్రామం సర్పంచులు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.