NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోవిడ్ సంక్షోభంలో.. 15కోట్ల స‌హాయం..!

1 min read

Mumbai: Bollywood actor Amitabh Bachchan at Juhu beach during the NDTV-Dettol Banega Swachh India Campaign in Mumbai on Monday. PTI Photo by Santosh Hirlekar(PTI10_2_2017_000043B)

ప‌ల్లెవెలుగు వెబ్: బిగ్ బీ అమితాబ్ బ‌చ్చన్ వివిధ సంద‌ర్భాల్లో కోవిడ్ రోగుల కోసం 15 కోట్ల రూపాయాల ఆర్థిక స‌హాయం అందించారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వయంగా చెప్పారు. కోవిడ్ బాధితుల కోసం సినీ ప్రముఖులు స‌హాయం చేయ‌డంలేద‌న్న విమ‌ర్శల‌కు స్పందిస్తూ ఆయ‌న త‌న సాయాన్ని వెల్లడించారు. చేసిన స‌హాయం చెప్పుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంద‌ని, కానీ విమ‌ర్శలు వ‌స్తున్న త‌రుణంలో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. వివిధ ప్రాంతాల్లో కోవిడ్ ఆస్పత్రుల‌కు, రోగుల‌కు, పేద రైతుల‌కు త‌న‌కు చేత‌నైన స‌హాయం అందించాన‌ని చెప్పారు. 15 కోట్ల రూపాయాలు అంటే.. త‌న‌కు కూడ భార‌మ‌ని, అయినా స‌రే త‌న వంతుగా స‌హాయం చేశాన‌ని బిగ్ బి చెప్పారు. ఇటీవ‌ల డిల్లీలోని గురుద్వార కోవిడ్ సెంట‌ర్ కు రూ.2 కోట్ల విరాళం అందించారు.

About Author