వైసీపీలోకి 15 కుటుంబాలు చేరిక
1 min read– అడుగు అడుగున బాణాసంచా కలుస్తూ, పూలు చల్లుతూ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికిన గ్రామ ప్రజలు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని ఉప్పరపల్లి హరిజనవాడలో ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ రాజేంద్రప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నుంచి వైసీపీ లోకి చేరారు, వీరికి ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారంగా పార్టీల్లోకి ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంక్షేమ పథకాలను చూసి ప్రజలు వైఎస్ఆర్ సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు, సంక్షేప పథకాలు అమలులో ఎక్కడ కూడా కులమతాలకు, పార్టీలకు తావు లేకుండా అర్హులు అయితే చాలు ప్రతి ఒక్కరికి వారి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, ఆయన తెలిపారు, పార్టీలో చేరిన వారందరూ కూడా పార్టీ విధి విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు, పార్టీలో చేరిన వారందరికీ కూడా సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ విధి విధానాలు కలిగిన పార్టీ అని పార్టీలో ఉండే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా క్రమశిక్షణతో ముందుకు వెళుతున్నారని నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో పార్టీ మరింత బలోపేతం అయిందని ఆయన తెలియజేశారు, రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో పార్టీ విజయదుంది మ్రోగిస్తుందని ఆయన అన్నారు, అనంతరం పార్టీలో చేరిన వారు జోహార్ వైయస్సార్, రవీంద్రనాథ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, పార్టీలో చేరిన వారు భూమా బ్రదర్స్, శ్రీనివాసులు, సతీష్, దివాకర్, వెంకటరమణ, బుజ్జి, శ్రీనివాసులు, సుబ్బరాయుడు, శేఖర్, కేశవ, వెంకటస్వామి, సుబ్బరాయుడు, పెండ్లిమర్రి రామచంద్ర, లక్ష్మీదేవి, పద్మావతి, లక్ష్మీదేవి కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ఎర్ర సాని మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎర్ర సాని రాజగోపాల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ గాజులపల్లె సంపూర్ణం రెడ్డి, భోగాల కొండారెడ్డి, ఎంపీటీసీ నిరంజన్ రెడ్డి, పాత కుంట శ్రీనివాసులు రెడ్డి, పుల్లారెడ్డి, గాజుల పల్లె సాయినాథ్ రెడ్డి, చింతకుంట సాయిరాం రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు ,కార్యకర్తలు , అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.