ప్రైవేట్ స్కూళ్లలో 15శాతం ఫీజు రద్దు.. సంచలనం..!
1 min readపల్లెవెలుగు వెబ్: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు భారీ ఊరట కలిగించింది ఒడిశా ప్రభుత్వం. విద్యా సంవత్సరం 15 శాతం ఫీజులను తగ్గించాలని ప్రైవేటు పాఠశాలలకు సూచించింది. కరోన నేపథ్యంలో రెండేళ్లుగా విద్యార్థులు స్కూళ్లకి వెళ్లలేదు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలలు పూర్తీ ఫీజు వసూలు చేయడం పట్ల తల్లిదండ్రుల సంఘం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని మీద హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు మూడు కమిటీలు నియమించింది. ఈ విషయం మీద ఒక స్పష్టత రాకపోవడంతో .. మరోసారి వివాదం చెలరేగకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం వార్షిక ఫీజును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.