పల్లెవెలుగువెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ల పై బేర్ పట్టు కొనసాగుతోంది. వరుసగా నష్టాలతో సూచీలు ట్రేడ్ అవుతున్నాయి. ఒమిక్రాన్ భయాలు.. ప్రభుత్వాల నిర్ణయాలతో సూచీల పై బేర్ పట్టు సాధించింది. యూఎస్ ఫెడ్ ప్రభావం కూడ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవ్వడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కావడంతో సూచీలు కుప్పకూలాయి. భారీ ఎత్తున నష్టాలు మూటగట్టుకున్నాయి. 15 నిమిషాల్లో 2.5 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా మార్కెట్ల నుంచి లాభాలు స్వీకరిస్తున్నారు.