ఘనంగా శ్రీ షిరిడి సాయినాథ్ ధ్యాన మందిర్ 15వ వార్షికోత్సవ వేడుకలు..
1 min read– భారీ అన్న సమాధాన వేలాదిగా పాల్గొన్న భక్తులు..
– ప్రతి ఒక్కరికి సాయినాథ్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి..
– ఆలయ కమిటీ సభ్యులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఏలూరు జిల్లా , శ్రీ షిరిడి సాయినాథ ధ్యాన మందిర్ . సాయినాథ్ నగర్ మూడవ రోడ్డు తంగళ్ళమూడి కండ్రిగూడెం లో 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. కాకడ హారతి, జ్యోతి ప్రజ్వలన పంచామృత భిశాకం జయ జయ సాయి నామ సంకీర్తనలతో పూజలు నిర్వహించి శ్రీ శిరిడి సాయి నాధుని భక్తులు పూజలు నిర్వహించి తమ మోక్కులను తీర్చుకున్నారు. గత 15 సంవత్సరాలుగా నిర్వీరా మంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. తంగెలమూడి కండ్రిగూడెం ఎఫ్ సిఐ గోడౌన్ వెనక మానే సురేష్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాబా వారిని పురవీధులలో ఊరేగించుట శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం గురువారం రాత్రి పవళింపు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన సమారాధనలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శ్రీ బాబా వారి తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులు స్వయంగా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయినాథ్ ధ్యాన మందిర్ ఆలయ కమిటీ వారు సహాయ సహకారాలు అందించిన మరియు ఆలయ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి శిరిడి సాయి నాధుడు ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాలని, వారందరికీ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.