అభివృద్ధి పథంలో 15 వ వార్డు ..!
1 min read– చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి సహకారంతో..
– కౌన్సిలర్ కృష్ణవేణి కృషితో బీఆర్ఆర్ నగర్ అభివృద్ధి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ 15 వార్డును అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని వార్డు కౌన్సిలర్ కొండేపి కృష్ణవేణి, సోషల్ మీడియా కో కన్వీనర్ బ్రహ్మయ్య ఆచారి తెలిపారు.రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆశీస్సులతో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి నాయకత్వంలో 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ పార్టీ తరుపున కృష్ణవేణి విజయం సాధించారు. నందికొట్కూరు మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికై రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని మూడవ సంవత్సరం లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని బైరెడ్డి నగర్ కాలనీ,బుడగజంగాల కాలనీ,కొత్త కొట్టాలు, ప్రాంతాలు 15 వ వార్డు పరిధిలో ఉన్నాయన్నారు.మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు బీఆర్ఆర్ నగర్ గత కొన్ని ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక పోవడంతో కాలనీ లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ సతమతమవుతున్న తరుణంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్ సుధాకర్ రెడ్డి సహకారంతో 15 వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వార్డు లోని అన్ని వీధుల్లో సిసి రోడ్లు, డ్రైనేజ్ కాలువలకు ఏర్పాటు చేస్తూ అభివృద్ధి వైపు పరుగులు నడిపిస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో కాలనీలో అభివృద్ధి పనులు జరగడం చూసి కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చైర్మన్ సుధాకర్ రెడ్డి సహకారం, అధికారులు సహకారంతో లక్షలనిధులు వార్డు అభివృద్ధి కోసం మంజూరు చేయడంతో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి సహకారంతో వార్డు లో అన్ని విధాలుగా అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని వార్డును అభివృద్ధి చేసేందుకు తమ సాయశక్తులా కృషి చేస్తామని కౌన్సిలర్ కృష్ణవేణి తెలిపారు.వైసీపీ పాలనలో సిద్దార్థ రెడ్డి ,సుధాకర్ రెడ్డి సహకారంతో జరిగిన అభివృద్ధి పనులు గత ప్రభుత్వం హయాంలో ఎన్నడూ జరగలేదన్నారు. ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా పారిశుధ్య పనులు, వీధిలైట్లు ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. వార్డులో సుమారుగా రూ.40 లక్షలతో సీసీ రోడ్లు వేయించమన్నారు. డ్రైనేజీ కాలువల నిర్మాణము కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. బుడగజంగాల కాలనీ లో డ్రైనేజీ, రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉందని అందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. తమ వార్డులో వైయస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం , జగనన్న చేదోడు, వాహన మిత్ర , జగనన్న తోడు , వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుకతో మరికొందరు ప్రయోజనం పొందారని వివరించారు. సహకారంతో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు సోషల్ మీడియా కో కన్వీనర్ బ్రహ్మయ్య ఆచారి.వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిస్కారమే తమ లక్ష్యం అన్నారు.