తనిఖీల్లో .. 16 క్వింటాల అక్రమ రేషన్ బియ్యం సీజ్..
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు : కరణం కుమార్, రీజినల్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారి, ఏలూరు వారికి రేషన్ బియ్యం అక్రమముగా నిల్వ చేసినట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారo ప్రకారం వారి ఆదేశాల మేరకు కామవరపుకోట మండలం కామవరపుకోట గ్రామంలో జంగారెడ్డిగూడెంకు చెందిన కొండూరు ఫలనికుమార్ నకు చెందిన రేషన్ బియ్యం పాత భవనం నందు నిల్వ చేసినట్లు గుర్తించి విజిలెన్సు, రెవిన్యూ మరియు పౌర సరఫరా అధికారులు తనికీ చేయగా 16 క్వింటాళ్ళ రేషన్ బియ్యం కామవరపుకోట పరిసర ప్రాంతాలలో తక్కువ ధరకు కొనుగోలు చేసి కాకినాడ మండలం ప్రత్తిపాడు గ్రామం నకు చెందిన చోడిసేట్టి మహేష్ కు ఎక్కువ ధరకు అమ్ముచున్నట్లుగా తెలియచేసారు. ఈ తనికీలో రు.64,000/-లు విలువ కలిగిన బియ్యం సీజ్ చేసి కొండూరు ఫలనికుమార్ అతని భాగస్వామి షేక్ లాల్ జాన్ భాషా మరియు చోదిసెట్టి మహేష్ అను వారిపై నిత్యవసరవస్తువుల చట్టం 1955 ప్రకారం వారిపై కేసు నమోదు చేయడమైనది. ఈ తనికీ నందు విజిలెన్సు సి ఐ యూజె విల్సన్ మరియు రెవిన్యూ, పౌర సరఫరా అధికారులు పాల్గొనడం జరిగినది.