PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎం ఓ యు ప్రకారం 16 వేలు ఇవ్వాలి

1 min read

పల్లెవెలుగు, వెబ్ నంద్యాల : నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కు ఎం ఓ యు లో పొందుపరిచిన 16 వేల రూపాయల వేతనం ఇవ్వాలని సిఐటియు నంద్యాల పట్టణ కార్యదర్శి కే యం డి గౌస్ సిఐటియు జిల్లా నాయకులు వెన్న బాల వెంకట్ డిమాండ్ చేశారు.శనివారం స్థానిక నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కు రెండు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని ఎంవోయూ ప్రకారం 16 వేల రూపాయలు వేతనం ఇవ్వాలని, మూడవరోజు నిరసనలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన గేటు ముందు షిఫ్ట్ చేంజింగ్ టైం లో ధర్నా,నిరసన తెలియజేయడం జరిగింది.ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన సిఐటియు పట్టణ కార్యదర్శి కే యం డి గౌస్ సిఐటియు జిల్లా నాయకులు బాల వెంకట్ మాట్లాడుతూ ఎం ఓ యు ప్రకారం 300 బెడ్స్ కు 42 మంది సెక్యూరిటీ గార్డ్స్ పనిచేయాల్సి ఉండగా 34 మందితో మాత్రమే పని చేయించుకుంటూ సెక్యూరిటీ గార్డ్స తో వెట్టిచాకిరి చేయించుకుంటూ వేధిస్తున్నారని అన్నారు.ఎం ఓ యు ప్రకారం 16,000 ఇవ్వాల్సి ఉండగా కేవలం 8080 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. కార్మిక చట్టాలను అమలు చేసి నెలకు ఒక సి ఎల్ తో పాటు బోనస్, ఇంక్రిమెంట్లు అమలు చేయాలని, మహిళా సెక్యూరిటీ గార్డ్స్ కు రెస్ట్ రూమ్ ఏర్పాటు చేయాలని తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ సిఐటియు నాయకులు నాగన్న, సురేష్, సుబ్బరాయుడు, లక్ష్మీదేవి, హైమావతి, సుమలత, బాల ఆంజనేయులు, క్రిస్టఫర్, కె పి చెన్నయ్య, వినోదు లతోపాటు సెక్యూరిటీ గార్డ్స్ అందరూ పాల్గొన్నారు.

About Author