16 యూట్యూబ్ చానెళ్లు నిషేధం !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం 16 యూట్యూబ్ చానెళ్ల పై నిషేధం విధించింది. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ దేశ భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ న్యూస్ చానళ్లను బ్యాన్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇందులో పది యూట్యూబ్ చానళ్లు ఇండియాకు సంబంధించినవి కాగా ఆరు యూట్యూబ్ చానళ్లు పాకిస్తాన్‌కు సంబంధించినవి తెలిపారు. ప్రస్తుతం బ్యాన్ చేయబడిన యూట్యూబ్ చానళ్ల వివర్‌షిప్ 68 కోట్లు ఉందని, అయితే వీరు యూట్యూబ్ వేదికను భారత్‌లో భయాందోలనలు సృష్టించడానికి, మత సామరస్యాన్ని పాడు చేయడానికి, అలాగే ప్రజా జీవినానికి ఇబ్బందికలేగా తప్పుడు వార్తలు, ఆధారాలు లేని సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.