మోక్షగుండం విశ్వేశ్వరయ్య 162 వ జయంతి వేడుకలు
1 min read– కె రాజుని సన్మానించిన కార్యాలయ సిబ్బంది..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు నీటిపారుదల శాఖ పోలవరం ప్రధాన కుడికాలువ విభాగం ఆఫీసులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య 162 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విల్సన్ పాల్గొన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కావేరి నదిపై ఆనకట్టనే నిర్మించి కర్ణాటక తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఆయకట్టుకు నీరు అందించిన గొప్ప దాసుని కూడా అని వారి సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం సర్ అనే బిరుదు భారత ప్రభుత్వం భారతరత్న బిరుదును ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి రోజునే ఇంజనీర్స్ డే గా పరిగణించి 55 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. అనంతరం ఇరిగేషన్ ఎస్సీ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్న విల్సన్ ను దుస్సాలవ తో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏపీ ఎన్జీవో అసోసియేషన్అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఇంజనీరింగ్ పితామహుడుగా పిలుస్తారని, ఆయన చేసిన సేవలు వెలకెట్టలేనివని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే మనందరం ముందుకు నడుచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నారు.