NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక 16వ ఉత్సవం..

1 min read

వేలాదిమందికి అన్న సమారాధన..

సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు..

ఉత్సవ కమిటీ సభ్యులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు   : పెదపాడు మండలం ఏపూరు పంచాయతీలోనీ నులు కొండ చెరువు  హనుమాన్ నగర్ లో సంప్రదాయ బద్ధంగా గత 16 సంవత్సరాలుగా శ్రీ వరసిద్ధి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని గ్రామానికి చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు ఏలూరు వెంకటరమణ, దొడ్డి సుబ్రమణ్యం, బోర్ర సురేష్, చింతా సూరిబాబు తెలిపారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చింత జగ్గారావు ఆవరణలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం దగ్గర భారీ అన్న సమారాధన జరిగింది. ఉదయం 11 గంటల నుంచి అన్న సమారాధన ప్రారంభమైంది వేలాదిగా భక్తులు పలువురు మహిళలు అన్న సమారాధన కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అక్కడికి వచ్చిన భక్తులు ముందుగా గణేష్ ని పూజించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ అన్న సమారాధన లో మండపానికి నలువైపులా భక్తులు సౌకర్యార్థం ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహక కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా చింత జగ్గారావు, గరికపాటి ఆనందం, బి వెంకటరమణ, ఏలూరు రమణ లు భోజనం ఏర్పాట్లు చేయడంలోనూ భక్తులకు అందించడంలోనూ ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నారు. మరికొంతమంది ఉచ్చావ్ కమిటీ సభ్యులు వీసం వెంకటేశ్వరరావు. కె అంకబాబు, వీసం మురళీకృష్ణ లు భక్తులకు తాగునీరు తోపాటు వృద్ధులు, వికలాంగులకు భోజనం నిర్వహించడం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు లడ్డు వేలం పాటలో భక్తులు పాల్గొన్నారు. ఆ తర్వాత గణేష్ విగ్రహాన్ని డీజే బ్యాండ్ మేళాలతోనూ విచిత్ర వేషధారనలతోనూ డీజే సౌండ్లతోనూ భక్తుల ఆనందోత్సవాల మధ్య హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఏలూరు కాలువలో గణేష్ నిమజ్జనం జరిగింది. విచ్చేసిన భక్తులకు ఎక్కడ ఏ అసౌకర్యం కలపకుండా కమిటీ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సహకరించిన యూత్ సభ్యులకు, పోలీసు వారికి, అధికారులకు, అనధికారులకు, గ్రామ పెద్దలకు, సహకారం అందించిన దాతలకు, పేరుపేరునా కృతజ్ఞతలు నిర్వాహకులు తెలియజేశారు.

About Author