కత్తి మహేష్ కు 17 లక్షల ప్రభుత్వ సాయం !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఇటీవల నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సినీ విమర్శకుడు కత్తి మహేష్ చికిత్సకు ఏపీ ప్రభుత్వం సాయం ప్రకటించింది. చెన్నై అపోలో అస్పత్రిలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ కి.. ఏపీ ప్రభుత్వం 17 లక్షల భారీ సహాయాన్ని ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వార ఈ సహాయాన్ని అందించింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఆయనకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. మహేష్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం.