పదేళ్లలో 17లక్షల మందికి ఎయిడ్స్ !
1 min readపల్లెవెలుగువెబ్ : గత పదేళ్లలో దేశంలో 17,08,777 మంది హెచ్‌ఐవీ బారిన పడ్డారని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వెల్లడించింది. అరక్షితశృంగారమే ఇందుకు కారణమని పేర్కొంది. కొత్తగా హెచ్‌ఐవీ బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని వివరించింది. 2011–12లో 2.4 లక్షల మందికి హెచ్‌ఐవీ సోకగా, 2020–21 85,268కు తగ్గిందని తెలిపింది. ఎయిడ్స్ బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. గత పదేళ్లలో ఏపీలో 3,18,814, మహారాష్ట్రలో 2,84,577, కర్ణాటకలో 2,12,982, తమిళనాడులో 1,16,536, యూపీలో 1,10,911, గుజరాత్‌లో 87,440 హెచ్‌ఐవీ కేసులు బయటపడ్డాయి.