17 ఏళ్లకే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఓటు హక్కు కోసం 17 ఏళ్లకే దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటుహక్కు మాత్రం 18 ఏళ్లు వచ్చాకే వస్తుంది. ఎన్నికల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఏడాదికి 4 సార్లకు పెంచింది. అంటే.. జనవరి 1న, ఏప్రిల్ 1న, జూలై 1న, అక్టోబరు 1న ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం 17 ఏళ్ల వ్యక్తి ఈ ఏడాదే అక్టోబరు 1న (ముందస్తుగా) దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరులో అతడికి 18 ఏళ్లు వస్తే.. జనవరిలో నవీకరించిన ఓటరు జాబితాలో అతడి పేరును ఎన్నికల కమిషన్ చేరుస్తుంది. అలాగే.. జనవరి 2 నుంచి ఏప్రిల్ 1 మధ్య 18వ ఏట అడుగుపెట్టే వారు ఏప్రిల్ 1న.. ఏప్రిల్ 2 నుంచి జూలై 1 మధ్య 18వ ఏట అడుగుపెట్టేవారు జూలై 1న ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.