NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

172 జీఓతో.. ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే కుట్ర: పీడీఎస్​యూ

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం ప్రాజెక్టు : ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే జీఓనం. 172 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షులు ఎస్​కె. జునైద్​ బాష. మంగళవారం శ్రీశైలం మండలంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య సంఘం, పీడీఎస్​యూ ఆధ్వర్యంలో జనరల్​బాడీ మీటింగ్​ జరిగింది. ఈ సందర్భంగా ఎస్​కే జునైద్​ మాట్లాడుతూ నూతన విద్యా విధానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే కుట్రలో భాగమే నూతన విద్యా విధానం అమలు చేస్తున్నారని ఆరోపించారు.

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యావిధానాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు, కేంద్రంలో బిజెపి పాలిత ప్రాంతంలోనే విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతుందని జాతీయ నూతన విద్యా విధానం ముసాయిదా బిల్లును అమలు చేయకుండా ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం మరియు మరిన్ని అప్పుల కోసం విద్యా విధానం పూర్తిగా నిర్వీర్యం అయ్యే విధంగా ఉన్న జీవో నెంబర్ 172 ను తీసుకొని రావడం అత్యంత బాధాకరమన్నారు. జీవో నెంబర్ 172 వలన రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం, మంచి పాఠ్య పుస్తకాలు మంచి సదుపాయాలు కల్పిస్తామని చెబుతున్నారు తప్ప వాటిలోని లోటుపాట్లను మాత్రం వివరించే ప్రయత్నం రాష్ట్రప్రభుత్వం చేయకుండా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఐ.ఎఫ్.టి.యు (IFTU)జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం, పిడి ఎస్ యు ( PDSU)స్థానిక శ్రీశైలం మండల కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author