175 సీట్లు సాధించాలి !
1 min read
పల్లెవెలుగువెబ్ : గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయని…ఈసారి 175 సాధించాలని పార్టీ నేతలకు సీఎం జగన్ సూచించారు. గడపగడపకు వైసీప ప్రభుత్వంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పం మున్సిపాలిటీలో గెలుస్తామని ఎవరైనా అనుకున్నామా? అని వ్యాఖ్యానించారు. అలాగే 175కి 175 సీట్లు సాధించాలని సూచించారు. ‘‘ఇది మన లక్ష్యం. పెద్దకష్టం కాదు. ప్రతి ఇంటికీ మేలు జరిగితే మనకు ఇంకేం కావాలి. చరిత్రలో మనం ఒక ముద్ర వేశాం. సంతృప్తికరంగా మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నాం. కాలర్ ఎగరేసుకుని ప్రజల్లో తిరగగలుతున్నాం. మనం చేయాల్సింది ప్రజల మద్దతు పొందడమే.’’ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.