PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దుగ్గిరాల సెయింట్ జోసెఫ్ దంత కళాశాల లో 17వ కాన్వకేషన్..

1 min read

– 2018 సంవత్సరపు అండర్

– గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 2020 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థులకు పట్టాలు పంపిణీ..

– వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది

 – వైస్ ఛాన్స్లర్ డాక్టర్: కోరుకొండ బాబ్జి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ బిషప్ జయరావు పొలిమేర సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల 17 వ కన్వకేషన్ కి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. 2018. సంవత్సరపు అండర్ గ్రాడ్యుయేట్  విద్యార్థులకు2020.పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ డాక్టర్ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ కోరుకొండ బాబ్జి  పాల్గొన్నారు. ఈయన మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని విలువలతో కూడినదని ప్రతి విద్యార్థి మీ డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత మీ యొక్క జీవితం ఇప్పటినుంచే మొదలవుతుందని మీరు వృత్తిపట్ల మరియు రోగుల పట్ల ప్రేమతో ఉండాలని వారే మీ యొక్క అతిధులని మరియు ముఖ్యంగా మీ తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రతిరోజు వారితో మీ యొక్క ఆలోచనలను వారికి తెలియజేస్తూ వారితో ప్రేమతో గడపాలని సూచించారు. ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ ఓనర్ గా గుంటూరు కేర్ కాలేజ్ ప్రొఫెసర్ మరియు హెచ్ ఓ డి డాక్టర్ మహబూబ్ షేక్ పాల్గొన్నారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా ఏలూరు పీఠం వికారి జనరల్ ఫాదర్ పి బాల, ఛాన్స్లర్ ఫాదర్ బాబు జాగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముందుగా కళాశాల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ జి మోజెస్ తొలి పలుకులను తెలియజేశారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ N సేవ రాజు, కళాశాల అడ్మినిస్ట్రేటర్స్ ఫాదర్ ఎల్ ఫిలిప్స్, ఫాదర్ ఎం ధర్మరాజు మరియు Hనర్సింగ్ కళాశాల ఫాదర్ పి జాకబ్, వి డి యం సి ట్రస్ట్ నెంబర్స్ ఫాదర్ ఐ మైకేల్ , కళాశాల హెచ్ ఓ డి స్ స్టాప్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. తనంతరం ముఖ్య అతిధి హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ బాబ్జి , బీడీఎస్ మరియు ఎండీఎస్ విద్యార్థులకు పట్టాలను  అందించారు. తనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

About Author