19 లక్షల వాట్సాప్ అకౌంట్ల పై వేటు !
1 min readపల్లెవెలుగువెబ్ : వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. మే నెలలో 19 లక్షల ఇండియన్ అకౌంట్లను నిషేధించినట్టు మెటా సారధ్యంలోని మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ ప్రకటించింది. వాట్సప్ గ్రీవెన్స్ మార్గం, నిబంధనల అతిక్రమణలను గుర్తించే సొంత వ్యవస్థల ద్వారా యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా నిషేధం విధించినట్టు వివరించింది. ఈ మేరకు మే నెల ‘యూజర్-సేఫ్టీ’ రిపోర్టులో వాట్సప్ ప్రతినిధి వెల్లడించారు. అందిన ఫిర్యాదులు.. వాటిపై తీసుకున్న చర్యల వివరాలను రిపోర్టులో పేర్కొన్నామన్నారు.