PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా  సావిత్రి బాయ్ పూలె 193వ జయంతి 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ :  సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే 193 వ జయంతి వేడుకలు పత్తికొండ  జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా బాలికల ఉన్నత పాఠశాల  ప్రధానోపాధ్యారాలు ఎంకమ్మ మేడం అధ్యక్షతన సావిత్రిబాయి పూలే, షేక్ ఫాతిమాభి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎంకమ్మను మహిళా ఉపాధ్యాయులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు, దండి మల్లికార్జున   పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు కొత్తపల్లి సత్యనారాయణ,  భారతి, pet రుక్మిణి, కర్ణం చంద్ర పాల్గొని పూలమాలలు, దుశ్యాలువులతో సత్కరించారు. సందర్భంగా నిర్వహించిన టాలెంట్ టెస్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు  పరీక్ష అట్టలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీలు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

About Author