1964 సహకార చట్ట సవరణలపై అవగాహన కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : జిల్లా మార్కెటింగ్ సహకార సంఘం, ఏలూరు నందు రాష్ట్ర సహకార యూనియన్, విజయవాడ వారిచే రాష్ట్ర సహకార శాఖ ఏలూరు జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘముల ముఖ్య కార్యనిర్వహణాధికారులకు సహకార చట్టం 1964 నకు ఇటీవల వచ్చిన సవరణలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించబడినది.ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా జిల్లా సహకార అధికారి జాయింట్ రిజిస్టారు/జిల్లా సహకార అధికారి మిల్టన్ విచ్చేసిరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘములను నిర్వహించుటకు చట్టనిబంధనలపై అవగాహన ముఖ్యమని ఇటీవల సహకార సంఘములను బలోపేతం చేయుటకు ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమములను గురించి వివరించరు.ఈ శిక్షణా కార్యక్రమంలో తొలుత విజయవాడ సహకార శిక్షణ కేంద్ర ప్రిన్సిపాల్ ఎం. రామ్మోహన్ ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యము గురించి శిక్షణ యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు, అనంతరం రాష్ట్ర సహకార యూనియన్ అధ్యాపకులు ఆర్. శ్రీనివాసరావు సహకార సంఘములను బలోపేతం చేయుటకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను గురించి వివరించారు. అలాగే జిల్లా సహకార ఆడిట్ అధికారి ఏ.శ్రీనివాస్ మాట్లాడుతూ 1964 సహకార చట్టమునకు ఇటీవల చేసిన సవరణలు గురించి వివరించారు.ఈ కార్యక్రమనికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఓ. ఎస్ .డి. అజిత్ కుమారి, డివిజనల్ సహకార అధికారి అబ్దుల్ హదీ, అసిస్టెంట్ రిజిస్టర్ నరసింహారాజు, ఇతర సహకార శాఖ సిబ్బంది హాజరైనారు. డివిజనల్ సహకార అధికారి వారి వందన సమర్పణతో ఈ కార్యక్రమము ముగిసినది.