PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2 రోజులు..65 కేసులు..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కర్నూలు జిల్లా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ తుహిన్ సిన్హా IPS ఆదేశాలతో… జిల్లాలో రెండు రోజులుగా కర్నూలు మరియు నంద్యాల సెబ్ పర్యవేక్షణాధికారులు భరత్ నాయక్, శ్రీధర్ రావుల ఆధ్వర్యంలో నాటుసారా తయారీ కేంద్రాలపై విస్తృతదాడులు నిర్వహించారు. లోకల్​ పోలీసులు, సెబ్​ అధికారులు సమన్వయంతో వివిధ బృందాలుగా ఏర్పడి నాటుసారా స్థావరాలపై మూకుమ్మడి దాడులు చేశారు.

దాడులలో బంగారుపేట, గుమ్మితం తాండా, మునగాల పాడు, పసుపల, అలేబాద్ తాండా, సీతమ్మ తాండా, సిద్దాపురం, రోల్లపాడు తాండా, యల్లమ్మగుట్ట తాండా, అరికెర తాండా, నెర్నీకి తాండా, కోళ్ల బావాపురం, నందికోట్కూర్ న్.స్.కాలనీ, ఆదోని, గూడూరు న్.స్.కాలనీ, మాధవరం తాండా, పారుమాన్దొడ్డి తాండా, కొండమనాయని పల్లి, గడ్డమేకల పల్లి, మంగంపేట తాండా, అహోబిలం, పాణ్యం చెంచు కాలనీ, నారాపు రెడ్డి కుంట ప్రాంతాలలో నాటుసారా బట్టీలను ధ్వంసం చేశారు.

కర్నూల్ జిల్లాలో 65 కేసులు నమోదు చేసి, 13 మందిని అరెస్ట్ చేసి, 788 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక 50,200 లీటర్ల బెల్లం ఊట ద్వంసం చేసి, 04 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు కర్నూల్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ భరత్ నాయక్ తెలిపారు.

About Author