2వేల లీటర్ల పాలు.. నేలపాలు..!
1 min readపల్లెవెలుగు వెబ్: నాణ్యత లేదనే సాకుతో 2వేల లీటర్ల పాలశీతలీకరణ కేంద్రంలోని పాలును పారబోశారు. కర్ణాటకలోని దొడ్డ పట్టణంలో ఈ ఘటన జరిగింది. పాలశీతలీకరణ కేంద్రంలోని పాలను మురుగు కాలువలో పారబోశారు. బమూల్ సిబ్బంది చర్యను డొడ్డ రైతులు తీవ్రంగా ఖండించారు. దొడ్డ రైతుల నుంచి సేకరించిన పాలు నాణ్యత లేవని బమూల్ సిబ్బంది తెలిపారు. ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం కంటే తక్కువైతే పాలపొడికి పనికిరావన్నారు. పొదుగువాపు ఉన్న ఆవుల నుంచి సేకరించిన పాలు, పాచి పట్టిన కేన్లలో పాలు తీసుకురావడం కారణంగా నాణ్యత లోపిస్తున్నాయని బమూల్ సిబ్బంది తెలిపారు.