PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల‌కు 20 రోజుల ప్రత్యేక సెల‌వులు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కోవిడ్ బారిన‌ప‌డ్డ ప్రభుత్వ ఉద్యోగుల‌కు ప్రత్యేక సాధార‌ణ సెల‌వులు జారీచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 20 రోజుల పాటు ప్రత్యేక సాధార‌ణ సెల‌వులు మంజూరు చేస్తామ‌ని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2020 మార్చి 25 నుంచి ఈ ఉత్తర్వులు వ‌ర్తిస్తాయ‌ని ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది. మొత్తం ఐదు కేట‌గిరీలుగా విభ‌జించి ఉత్తర్వులు జారీ చేసింది.

  • ప్రభుత్వ ఉద్యోగి కోవిడ్ బారిన‌ప‌డి హోం ఐసోలేషన్ లో ఉంటే.. 20 రోజుల వ‌ర‌కు కమ్యూటెడ్ సెల‌వు ఇస్తారు. ఒక‌వేళ క‌మ్యూటెడ్ సెల‌వు అందుబాటులో లేకుంటే.. 15 రోజుల ప్రత్యేక సాధార‌ణ సెల‌వు ఇస్తారు. మిగ‌తా ఐదు రోజుల్ని ఈఎల్, హెచ్పీఎల్ నుంచి స‌ర్దుబాటు చేస్తారు.
  • ఉద్యోగి కోవిడ్ బారిన‌ప‌డి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటే.. పాజిటివ్ వ‌చ్చిన నాటి నుంచి 20 రోజుల పాటు సెల‌వు ఇస్తారు.
  • ఉద్యోగిపై ఆధార‌ప‌డ్డ కుటుంబ స‌భ్యులు లేదా క‌లిసి ఉంటున్న వారికి పాజిటివ్ వ‌స్తే .. 15 రోజుల ప్రత్యేక సాధార‌ణ సెల‌వు ఇస్తారు.
  • పాజిటివ్ వ‌చ్చిన వ్యక్తికి ఉద్యోగి కాంటాక్ట్ అయి ఉండి.. హోం క్వారంటైన్ లో ఉంటే.. ఏడు రోజుల పాటు వ‌ర్క్ ఫ్రం హోంగా ప‌రిగణిస్తారు.
  • కంటైన్ మెంట్ జోన్ లో ఉండి.. క్వారంటైన్ లో ఉంటే.. కంటైన్ మెంట్ జోన్ డీనోటిఫై చేసే వ‌ర‌కు వ‌ర్క్ ఫ్రం హోం విధులు నిర్వహిస్తున్న‌ట్టు ప‌రిగ‌ణిస్తున్నారు.

About Author