పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ !
1 min readపల్లెవెలుగువెబ్ : చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌లో 20శాతం వరకు ఇథనాల్‌ను కలపడానికి లక్ష్యంగా పెట్టుకున్న గడువును ఐదేళ్లు తగ్గించింది. తాజా నిర్ణయాన్ని అనుసరించి 2025-26 నాటికే ఈ లక్ష్యాన్ని ఆచరణలోకి తీసుకొస్తారు. అంతకుముందు దీనికి గడువును 2030గా కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ జీవ ఇంధన విధానంలో ప్రతిపాదించిన సవరణలను బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం పెట్రోల్‌లో 10శాతం వరకు ఇథనాల్‌ను కలపడానికి అనుమతిస్తున్నారు. అలాగే… దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల ద్వారా జీవ ఇంధనాల ఉత్పత్తిని ప్రోత్సహించాలని మంత్రివర్గం తీర్మానించింది.