NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి నుండి వైసీపీ లోకి 20 కుటుంబాలు చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలీ మండలంలోని కలచట్ల గ్రామం నుండి టీడీపీ కార్యకర్తలు వైసీపీ లో 20 కుటుంబాలను  ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి వైసిపిలోకి గురువారం ఆహ్వానించి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై యస్ జగన్ మోహనరెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు నచ్చి మరియు  ఏపీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి చేరమన్నారు. ఈ చేరికలు కలచట్ల వైసిపీ నాయకులు అరకచర్ల నాగరాజు, గుత్తి బాలాంజీ, బి రామమూర్తి,యమ్ జయరామయ్య, ఆధ్వర్యంలో చేరారు. ఈ కార్యక్రమానికి బోరెడ్డి కృష్ణారెడ్డి, కొండయ్య హాజరై టీడీపీ నుండి వైసిపీ లో చేరినవారు. డైలీ శివలింగ, జి శ్రీరాములు, మంగలి వెంకటరంగయ్య, డైలీ ధనుంజయ్య, డి ప్రహల్లాద, డి శివ, డి లక్ష్మీనారాయణ, డి కృష్ణ జె లాలు, గంట నాగేంద్ర, గూడూషా, బి అజయ్, కే రమేష్,చేరారు. ఈ కార్యక్రమం లో బండి పెద్దయ్య, సుంకర నాగరాజు, జె తిమ్మరాజు, యమ్ శివానాగయ్య, బాల వెంకటరాముడు, జె హనుమన్న, వై చంద్రశేఖర్, పి రాజేష్ పాల్గొన్నారు.

About Author