NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి పార్టీ వీడి  20 కుటుంబాలు వైసిపిలో  చేరిక

1 min read

పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్  అన్నమయ్య జిల్లా బ్యూరో: రాయచోటి రూరల్ మండలము లోని  గొర్లముదివేడుకు చెందిన 20 కుటుంభాలు తెలుగుదేశం పార్టీని వీడి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో , టి టి డి ప్రాంతీయ సలహా సభ్యుడు  , పార్టీ కార్యదర్శి బసిరెడ్డి సిద్దారెడ్డి ఆధ్వర్యంలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పార్టీ కండువాలు కప్పి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి  సముచిత స్థానం కల్పిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు అక్కర్షితులై పార్టలో చేరుతున్నామన్నారు.ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ని రాయచోటి ని జిల్లా కేంద్రం చేయడంతోపాటు నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తుండడం సంతోషాదాయకమని, శ్రీకాంత్ రెడ్డి పనితీరు,మంచి తనం తమకు నచ్చిందని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో పల్లెల నాగ మల్ రెడ్డి, చింతం రామచంద్రారెడ్డి, సుబ్బరాయుడు,ఎగువింటి రామయ్య, బుక్కే నరసింహులు నాయక్,వసంత రమేష్,యండపల్లె వెంకట్రామిరెడ్డి, రాజా, భాస్కర్  తదితర కుటుంబాలు వున్నారు.

About Author