20 న అంతర్రాష్ట్ర స్థాయి ఎద్దులు బండలాగుడు పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా 18 నుంచి శ్రీ కాశీ చంద్రమౌళీశ్వర స్వామి తిరుణాలను పురస్కరించుకుని న్యూ క్యాటగిరి కింద 20 న అంతరాష్ట్ర స్థాయి ఎద్దులు బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నామని గ్రామ సర్పంచ్ రవి యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు జీవి మధు యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ. 40 వేలు, రెండవ బహుమతి రూ. 30,000, మూడవ బహుమతి రూ. 20,000, నాలుగో బహుమతి రూ. 10,000, ఐదవ బహుమతి రూ. 5,000 అందజేయడం జరుగుతుందన్నారు. పోటీలలో పాల్గొనదల్చినవారు శుక్రవారం ఉదయం ఏడు గంటల లోపు ఎంట్రీ ఫీజు రూ. 400 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరు స్వామి వారి సేవలో పాల్గొని తిరుణాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు సంఘం నాయకులు, దేవాలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.