20 లక్షల రూ. నిధులతో అభివృద్ధి పనులు చేపడతాం..
1 min read– కుంబళనూరు గ్రామ సచివాలయం పరిధిలో రెండో రోజు కొనసాగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం –
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండలంలోని కుంబళనూరు గ్రామ సచివాలయం పరిధిలోని కుంబళనూరు మరియు క్యాంప్-2 గ్రామాలలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై ప్రదీప్ రెడ్డి, కుంభలనూరు సర్పంచ్ వీరేష్ ఆధ్వర్యంలో రెండో రోజు గడప గడపకు మనం ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ప్రతి గడపకు వెళ్లి లబ్ధిదారులతో ప్రభుత్వం తరఫున అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ అర్హత ఉండి కూడా ఇంకా పథకాలు అందకపోతే అలాంటి వారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ, గ్రామంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 20 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని ప్రదీప్ రెడ్డి తెలిపారు,ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు సుందరమ్మ మరియు వీరేష్, ఎంపీటీసీ ముత్తన్న, ఆయా గ్రామ నాయకులు, వైఎస్ఆర్సిపి అనిల్ కుమార్ , బుచ్చిరాయుడు , చక్రవర్తి, రామస్వామి,మండల నాయకులు,ప్రహల్లాద దేశాయి స్వామి,, నాగరాజుగౌడ,ఎంపీపీ అమరేశ, మాబుసాబు, రామన్నగౌడ, ఏకాంరెడ్డి,మండల ఎంపిడివో సుబ్బరాజు, పిఆర్ ఏఈ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి శేషాద్రి,పంచాయతీ కార్యదర్శి యోగేశ్వర,వివిధ గ్రామాల వైఎస్ఆర్సిపి నాయకులు చన్నబసప్ప, మరె గౌడ,సోమశేఖర, బసప్పగౌడ, పాండు,మరెప్ప,శివరాం, వివిధ గ్రామాల నాయకులు ఎంపీటీసీలు,సర్పంచులు,పాల్, మహేష్,లింగన్నగౌడ, ముకన్న,గ్రామ సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు,కన్వీనర్లు,వైఎస్ఆర్సిపి అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు,పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ తదితరులు పాల్గొన్నారు.