PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మురళి కోచింగ్ సెంటర్  విద్యార్థుల ప్రభంజనం

1 min read

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ కు 20 మంది విద్యార్థులు ఎంపిక

6 మంది విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: ఇటీవల విడుదలైన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ పరీక్ష ఫలితాలలో మురళి సైనిక్ అండ్ నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు.మురళి కోచింగ్ సెంటర్ నుండి 20 మంది విద్యార్థులు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశం కోసం మెడికల్ కు అర్హత సాధించగా అందులో 6 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు.రాయచోటి పట్టణంలోని కొత్తపేటలో 2017 సంవత్సరం నుండి కరస్పాండెంట్ సరితా దేవి,ప్రిన్సిపల్ ప్రసన్న కుమారి ల పర్యవేక్షణలో నడుస్తున్న మురళి సైనిక్ అండ్ నవోదయ య కోచింగ్ సెంటర్ నుండి గడిచిన 6 సంవత్సరాలలో సుమారు 50 మందికి పైగా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లోని కలికిరి,కర్ణాటక రాష్ట్రంలోని కొడగు,తమిళనాడులోని అమరావతి నగర్,కేరళ రాష్ట్రంలోని కొజికొట్టం తదితర ప్రాంతాలలో గల ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ కు ఎంపికయ్యారు.ఈ క్రమంలోనే 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ వారు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలలో ఆయా సైనిక్ స్కూల్స్ కు గానూ మురళి కోచింగ్ సెంటర్ నుండి 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.అందులో 300 మార్కులకు గానూ సాత్విక్(269),ఎస్టి విభాగంలో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన తునీస్(238),చిద్విలాస్ సూర్య(260), సి.కే.మహేష్ (259) ఎస్సీ విభాగంలో తేజస్ (239) ఎస్టి విభాగంలో నాలుగవ ర్యాంకు చేతన (201)లు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించగా మిగిలిన 15 మంది విద్యార్థులు భరత్ కుమార్ రెడ్డి(239), తేజస్ రెడ్డి(237)రాజ్యవర్ధన్ (236),ఆద్విక్ నందన్(232),రియాజ్ అహ్మద్,(230)వర్షిత్ యాదవ్,గగన్ సాగర్,మోక్షిత,గిరిధర్ రెడ్డి,యశ్వంత్ రెడ్డి,జోహెబ్, చింటూ నిహేష్ బాబు,హేమతేజ్,శాసిని లు వివిధ సైనిక్ స్కూళ్ళ లో ప్రవేశానికి మెడికల్ కు అర్హత సాధించారు.

ఈ క్రమంలోనే విద్యార్థుల పట్టుదల ఉపాధ్యాయుల సమిష్టి కృషితో 2022-23 విద్యా సంవత్సరానికి గానూ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో మురళి కోచింగ్ సెంటర్ నుండి 20 మంది విద్యార్థులు వివిధ సైనిక్ పాఠశాలలకు ఎంపిక కావడం పట్ల కోచింగ్ సెంటర్ కరస్పాండెంట్ సరితాదేవి,ప్రిన్సిపాల్ ప్రసన్న కుమారి లు హర్షం వ్యక్తం చేశారు.అలాగే విద్యార్థులు ఇంతటి విజయానికి కృషిచేసిన ఉపాధ్యాయులు అశ్విని,శ్వేత,సులోచన,శిల్పా,లక్ష్మీప్రియా,కొండమ్మ,వరలక్ష్మి,రుహీనా,రేష్మా,నౌహీరా,ప్రవళ్లిక,రోహిణి,జోత్స్న,ఆసిఫా,ప్రియాంక బృందాన్ని,విద్యార్థులను,వారి తల్లిదండ్రులను వారు అభినందించారు.

About Author