200 మంది మృతి.. మరోసారి లాక్డౌన్?
1 min readదేశంలో కరోనా కలవరం సృష్టిస్తోంది. కొత్త కేసుల నమోదు రోజురోజుకి పెరిగిపోతోంది. దీంతో వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరోన వ్యాక్సిన్ పంపిణీ వేగవంతంగా జరుగుతున్నా.. మరోవైపు కేసుల ఉధృతి కూడ కొనసాగుతోంది. ఫలితంగా మరణాల సంఖ్య కూడ పెరుగుతోంది. పెరుగుతున్న మరణాల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఆదివారం 880655 మందికి పరీక్షలు చేయగా.. 46951 మందికి పాజిటివ్ గా నమోదయ్యింది. మరణాల సంఖ్య కూడ 200 కు చేరుకుంది. దీంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రలో కరోన ఉదృతి అధికంగా ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. దేశ వ్యాప్తంగా 46 వేల కొత్త కేసులు నమోదయితే.. కేవలం ఒక్క మహారాష్ట్రలోనే 30 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రం తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా కూడ పాక్షిక లాక్ డౌన్ కేంద్రం ఆలోచన చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే .. దేశం మరో లాక్ డౌన్ ను ఎలా తట్టుకుంటుందనే ప్రశ్న ఇప్పుడు అందరిని వేధిస్తోంది. మొదటి లాక్ డౌన్ తో ప్రజా జీవితం ఎన్నడూ లేని ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో జనజీవనం స్థంభించింది. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఎంతో మంది ఆహారం దొరకక ఆకలి చావుల దరిదాపుల్లోకి వెళ్లారు. ఇలాంటి పరిస్థితి మరోసారి సంభవిస్తుందా? అన్న ప్రశ్న గగుర్పాటుకు గురిచేస్తోంది. మరోసారి లాక్ డౌన్ కనుక విధిస్తే.. దేశం ఆ సంక్షోభాన్ని తట్టుకోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.