మూడేళ్లుగా 2 వేల నోటు ముద్రించడం లేదట !
1 min readపల్లెవెలుగువెబ్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత అమలులోకి తీసుకొచ్చిన రూ.2 వేల నోటును ప్రింట్ చేయట్లేదని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో 2 వేల నోటు ఒక్కటి కూడా ప్రింట్ చేయలేదని పేర్కొంది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు ఆర్బీఐ ఇచ్చిన వివరాలలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కొత్తగా 2 వేల నోట్లు ప్రింట్ చేయలేదని తెలిపింది. కొంతకాలంగా రూ.2 వేల నోటు చలామణిలో కనిపించడంలేదు. ఏటీఎంలలో కూడా రూ.500 వందలు, రూ.200, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. మార్కెట్లో రూ.2 వేల నోటు కనిపించడమే అరుదైపోయిందని పలువురు దుకాణదారులు చెబుతున్నారు.