2025 (మహిళా దినోత్సవ వేడుకలు ఆరంభం)
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ముగ్ధ – 2025 మహిళా దినోత్సవ వేడుకలు ఆరంభం ఈ ప్రారంభ వేడుకకు శ్రీమతి మాలవరపు బాలలత, డైరెక్టర్ సిఎస్బి ఐ ఏ ఎస్ అకాడమీ, ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాలా లతా ప్రసంగంలో స్త్రీ సాధికారత కు పెద్దపీట వేశారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మహిళలు గొప్ప ఆశయాలను నిర్ణయించుకోవాలని, ఆశయాల కోసం పగలు రాత్రి కష్టపడాలని అందుకుగాను విద్యార్థులు మీరు స్కిల్ ఎంహాన్స్మెంట్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, న్యూ లాంగ్వేజెస్ మరియు కార్పొరేట్ స్కిల్స్ ను రోజువారి దినచర్యలో చేర్చుకోవాలని వాటిని రోజు సాధన చేయాలని, తద్వారా మీరు గొప్ప స్థాయిలో ఉండగలరని, ఇలా చేయడం ద్వారా మీకు ఆకాశమే హద్దని తెలియజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలను చేపట్టడం పట్ల బాలలత తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కాలేజీ యాజమాన్యాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ కే.ఈ శ్రీనివాసమూర్తిని మరియు అధ్యాపకులను అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని తద్వారా మహిళలకు చేయూత లాంటిదని తెలియజేశారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ డాక్టర్ కే.ఈ. శ్రీనివాసమూర్తి మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జె.ఉషశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించబడినది.