21వ జాతీయస్థాయి సాంస్కృతిక మేళా
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: భారతదేశ సాంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకే ఆదర్శమని కర్నూలు నగర మేయర్ బి .వై. రామయ్య అన్నారు. ఎస్ .వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 21వ జాతీయస్థాయి సాంస్కృతిక మేళాలో భాగంగా నగర మేయర్ బి.వై రామయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ఎస్ .వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ కళలను ప్రోత్సహించడానికి ఈ వేదికను ఏర్పాటు చేసిందని దీనిని అందరూ సద్వినియోగ పరుచుకోవాలన్నారు. జ్యోతి ప్రజ్వలన ప్రారంభ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న పాణ్యం శాసనసభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయ నృత్యాలు భారతదేశ సాంప్రదాయానికి ప్రతీకలని, చిన్నారులు చిన్నతనం నుండే కళలు ,సాంప్రదాయాల పై ఆసక్తిని పెంచుకొని మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్ .వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లా కళాకారులకు నిలయమని, 21 సంవత్సరాలుగా ఎస్ .వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ కళాకారులను ప్రోత్సహిస్తున్నదని, ప్రతి సంవత్సరం 4000 మంది దాకా జాతీయ సాంస్కృతిక మేళాలో అన్ని విభాగాల నుండి పాల్గొనడం జరుగుతున్నది అన్నారు. కళాకారులు అందరికీ ఉచిత భోజనం సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి మాట్లాడుతూ కళాకారులు ఆరోగ్యవంతమైన పోటీ తత్వాన్ని ఏర్పరచుకోవాలని, పాఠశాలలు కళాశాలల అధ్యాపకులు పోటీలలో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలని ఎస్వీ నారాయణమ్మ జ్ఞాపకార్థం ఈ పోటీలను ఏర్పాటు చేసి జాతీయస్థాయిలో కళాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఎస్వి జనక్ దత్తారెడ్డిని ఎస్ .వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఉపాధ్యక్షులుగా వివిధ సేవా కార్యక్రమాలకు చేపట్టనున్నామన్నారు .ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు జాతీయస్థాయి శాస్త్రీయ నృత్య పోటీలలో కర్నూలు, నంద్యాల, కడప ,చిత్తూరు, తిరుపతి ,హైదరాబాదు, మహబూబ్ నగర్ , వరంగల్ ఖమ్మం తదితర జిల్లాల నుండి 250 మంది కళాకారులు పాల్గొన్నారు అని ,ప్రపంచ శాంతి పై జరిగిన చిత్రలేఖన పోటీలలో 150 మంది మానవ హక్కుల పరిరక్షణ అంశంపై జరిగిన వ్యాసరచన పోటీలలో 200 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు అన్నారు. కార్యక్రమంలో సంచార జాతులు డైరెక్టర్ షరీఫ్, మాజీ కార్పొరేటర్ రమణ, లక్ష్మీ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు మరియు ఎస్. వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రాయపాటి నాగలక్ష్మి ,కోఆర్డినేటర్ శివయ్య ,భార్గవ్ నారాయణస్వామి ,న్యాయ నిర్ణీతలుగా ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ పేరిణి రవితేజ ,డాక్టర్ నరసింహులు, ఎలమర్తి రమణయ్య తదితరులు వ్యవహరించగా, వ్యాఖ్యాతగా చంద్రకంటి మద్దయ్య వ్యవహరించారు. కార్యక్రమంలో నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.