NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

24-25 సం: పీజీ మొదటి సెమిస్టర్,మూడవ సెమిస్టర్ ఫలితాలు విడుదల

1 min read

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనల వెల్లువ

ఏలూరు, న్యూస్​ నేడు: సర్‌ సి ఆర్‌ రెడ్డి అటానమస్‌ కళాశాలలో 2024-25 సం॥రంనకు సంబంధించి పి.జి. మొదటి సెమిస్టర్‌, మూడవ సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలు 27వ తేదీ గురువారం సర్‌ సి ఆర్‌ రెడ్డి అటానమస్‌ కళాశాల కరస్పాండెంట్‌ డా:కె.యస్‌.విష్ణుమోహన్‌ మరియు పి.జి. కళాశాల కరస్పాండెంట్‌ కానాల శ్రీనివాసరావు  విడుదల చేశారు. విద్యార్ధులు తమ పరీక్షాఫలితాలను కళాశాల వెబ్‌సైట్‌  https://results.sircrreddycollege.ac.in/నుండి తెలుసుకొనగలరని  కళాశాల ప్రిన్సిపాల్‌  డా:కె.ఎ.రామరాజు మరియు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ బి.వి.ఆర్‌.డి.ఫణికుమార్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమములో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ కె.విశ్వేశ్వరరావు, పి.జి.కోర్సుల డైరెక్టర్‌ డా:వి.ఆర్‌.యస్‌.బాబు యలమర్తి మరియు  కె.హేమలత, వి.ఎ.యన్‌.సతీష్‌ మరియు జి.యం.దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులను కళాశాల కరస్పాండెంట్‌ డా:కె.యస్‌.విష్ణుమోహన్‌,  పి.జి. కళాశాల కరస్పాండెంట్‌   కానాల శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్‌  డా:కె.ఎ.రామరాజు, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ కె.విశ్వేశ్వరరావు, ఐ.క్యు.ఎ.సి. కో-ఆర్డినేటర్‌ డా:జి.రాము అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *