25 కుటుంబాలు వైయస్సార్ పార్టీ లో చేరిక
1 min readపల్లెవెలుగు , వెబ్ బనగానపల్లె : మండలంలో అప్పలాపురం గ్రామం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో అప్పలాపురం గ్రామానికి చెందిన 25 కుటుంబాలు టిడిపి పార్టీని వీడి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. అప్పలాపురం గ్రామం వడ్డేపేట కాలనీకి చెందిన వడ్డే మురళి, వెంకటసుబ్బయ్య, నాగరాజు ,పుల్లయ్య, శ్రీనివాసులు, మందుల శ్రీనివాసులు, చంద్రుడు, ప్రభాకర్, మనోజ్, ఈడిగ రమణ, హుస్సేన్ భాష, పెద్ద అల్లా ప్రకాష్, దస్తగిరయ్య, బోయ రమణ, హేమంత్, గోపాల్, వెంకటేశ్వర్లు, ఓర్సు శ్రీనివాసులు కు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అపలాపురం గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి, అశోక్, ఆర్ .వెంకట సుబ్బారెడ్డి కర్ర తిరుపేం రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ బనగానపల్లె నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు మరియు జగనన్న అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వడ్డేపేట కాలనీకి చెందిన 25 కుటుంబాలు టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. పార్టీలో చేరిన వారందరికీ సమచిత స్థానాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అర్హులైన వారికి అందించడం జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని అలాంటి నాయకునికి మనమందరము అండగా నిలబడి మళ్లీ 2024 వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పారు.