ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన దిశగా భారత పరిశ్రమల సమాఖ్య , సదరన్ రీజియన్ చర్యలు చేపట్టనుంది. ఇందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలతో కలిసి పని చేయనున్నట్లు సీఐఐ సదరన్ రీజియన్ చైర్‌పర్సన్ సుచిత్రా ఎల్లా తెలిపారు. కేరళ, పుదుచ్చేరిలను మినహాయించి ఒక్కో రాష్ట్రంలో 5 లక్షల ఉద్యోగావకాశాలను కల్పించడానికి కృషి చేయనున్నాం. ప్రత్యేకంగా ఒక రంగంలో ఇన్ని ఉద్యోగాలంటూ ఏమీ లేదు. అన్ని రంగాల్లోకి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తామని వివరించారు.