NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

25 వేల‌కే కొత్త ట్రాక్టర్.. ఆశ్చర్యపోకండి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సాధార‌ణంగా కొత్త ట్రాక్టర్ కొనాలంటే ఇంజిన్ ధ‌ర 2 ల‌క్షల పైనే ఉంటుంది. ట్రాలీతో క‌లుపుకుంటే మొత్తం 5 ల‌క్షల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంది. ఐదెక‌రాలు, ప‌దెకరాలు ఉన్న సాధార‌ణ రైతుల‌కు ఇంత ధ‌ర‌పెట్టి కొనాలంటే త‌డిసి మోపెడ‌వుతుంది. ఇలాంటి రైతుల క‌ష్టాన్ని గ‌మనించిన ఒక రైతు కేవ‌లం 25 వేలకే ట్రాక్టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మ‌ధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశ జిల్లా ఘ‌ట్ వాయి గ్రామానికి చెందిన విజ‌య్ సింగ్ ర‌ఘువంశి ఆటో ఇంజిన్ తో మినీ ట్రాక్టర్ ని రూపొందించారు. మొద‌ట పాడైన ఆటో ఇంజిన్ కొని మెకానిక్ తో రిపేరి చేయించారు. తర్వాత సొంతంగా బాడీ రూప‌క‌ల్పన చేయించాడు. దానికి ఇంజిన్ అమ‌ర్చి మూడు చ‌క్రాలు బిగించి మినీ ట్రాక్టర్ రూపొందించాడు. దీంతో మూడు గంట‌ల్లో పావు ఎక‌రం దున్నవ‌చ్చు. దీనికి కేవ‌లం ఒక‌టిన్నర లీట‌ర్ల డీజిల్ అవ‌స‌రం అవుతుంది.

About Author