రాష్ట్రంలోని 26 జిల్లాల్లోస.హ. చట్టం అమలుకు లోకాయుక్త ఆదేశం
1 min readపల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: రాష్ట్రంలోని 26 జిల్లాల్లోస.హా. చట్టం అమలకు జిల్లా సమన్వయ కమిటీలను జిల్లా కలెక్టర్లు ను నియమించటానికి తగు చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర భూమి శిస్తుశాఖ ప్రధాన కమిషనర్ ను ఆదేశిస్తూ రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.అని కృష్ణాజిల్లా ఉయ్యూరు కు చెందిన స.హ. చట్టం సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గత నెల జూలై 15వ తేదీన రాష్ట్ర లోకాయుక్తకు చేసిన ఫిర్యాదు పై లోకాయుక్త ఆదేశాలను జారీ చేసిందని తెలియజేశారు. కృష్ణాజిల్లాలో సమాచార హక్కు చట్టం 2005 లో సమర్ధవంతంగా అమలు చేయడానికి గాను 26 జిల్లాలలో జిల్లా సమన్వయ కమిటీలను ప్రకారం జిల్లాల కలెక్టర్లు ఏర్పాటు చేయవలసిఉంది ఆ కమిటీలో సభ్యులుగా స.హా. చట్టం అమలు కోసం జిల్లాలో ఇద్దరు స.హ. చట్టం కార్యకర్తలను జిల్లా కలెక్టర్ల ను నియమించవలసి ఉంది. 26 జిల్లాల స.హ.చట్టం అమలు కొరకు సమన్వయ కమిటీ ఏర్పాటుకు భూమి శిస్తు కమిషనర్ తగు చర్యలు తీసుకోగలందులకు, సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.