PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

26 నుండి కార్తీక మాసం.. రాయితీతో బస్సు సర్వీసులు

1 min read

– డి పి టి ఓ ఎన్.వి.ఆర్ ప్రసాద్
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు:కార్తీక మాసం నేపధ్యంలో ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నామని జిల్లా ప్రజారవాణా శాఖాధికారి ఎన్ వి ఆర్ ప్రసాద్ తెలిపారు. గురువారం స్థానిక ఆర్ఎం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 26వ తేది నుండి కార్తీకమాసం నేపధ్యంలో పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్టోబర్ 30,నవంబర్ 6,13 తేదీల్లో భక్తుల సౌకర్యార్ధం శనివారం రాత్రి కూడా బస్సులు నడుపుతామని చెప్పారు. ఒకేరోజు పంచారామక్షేత్ర దర్శనాన్ని సకల నదీ స్నానాల ఫలం కోసం అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్వారకారామం,సామర్లకోట క్షేత్రాల దర్శనం,ఏలూరు, జంగారెడ్డిగూడెం,నూజివీడు నుండి ఒకే చార్జీగా వసూలు చేస్తామన్నారు.ఎక్స్ప్రెస్ బస్సుల ద్వారా పెద్దలకు రూ.900, పిల్లలకు రూ.750 చొప్పున వసూలు చేస్తామన్నారు.సూపర్ లగ్జరీ బస్సులు అయితే పెద్దలకు 1100, పిల్లలకు 950లు వసూలు చేయడం జరుగుతుందన్నారు. శబరిమలై యాత్ర దర్శనం కూడా ఏర్పాటు చేసామన్నారు. అతి తక్కువ ధరలతో,అతి తక్కువ రోజుల్లో శబరిమల యాత్ర దర్శనం ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏలూరు, నూజివీడు,జంగారెడ్డిగూడెం ఒకే టికెట్ ధర సూపర్ లగ్జరీ 2×2 ఫుస్బ్యక్ మరియు వీడియో సౌకర్యం బస్సును ఏర్పాటు చేస్తామన్నారు, ఒకేసారి బస్సు బుక్ చేసుకున్నచో గురుస్వామికి ఒక సీటు ఉచితం,ఇద్దరి వంటవారికి,ఇద్దరి మణికంఠలకు,ఆపై మరో ఇద్దరికి ప్రవేశం ఉచితంగా కలుగచేస్తామన్నారు.కేవలం 4రోజుల్లో డైరెక్టుగా శబరిమలై దర్శనం చేసుకునే ఏర్పాటు చేస్తామన్నారు.విజయవాడ, కాణిపాకం,భవాని,గుర్వా యూర్,ఎరుమేలి,పంబ, త్రివేండ్రం, మదురై,శ్రీరంగం, తిరుపతి మీదుగా ఏలూరు చేరుతుందన్నారు.4 రోజుల యాత్రకు గాను 4,600ల రూపాయలు,6రోజుల యాత్రకు 5,500లు వసూలు చేయడం జరుగు తుందన్నారు. అయ్యప్ప స్వాముల కోరికపై వారు కోరిన విధంగా టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేస్తామన్నారు.ఇటీవల దసరాకు వచ్చే సర్వీసుల ద్వారా సంస్థకు మరింత ఆదాయం లభించినట్లు చెప్పారు. ఆయన వెంట జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ ఎ గంగాధర్,నూజివీడు డిపో మేనేజర్ సిహెచ్ఎస్ పవన్ కుమార్,ఎకౌంట్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు,ఆఫీస్ సూపరింటెండెంట్ పి వేణుగోపా లరావు,పిఆర్ ఎల్వి నరసింహం ఉన్నారు.తొలుత శబరిమలై యాత్ర పంచారామ క్షేత్రాలకు సంబంధించిన పోస్టర్స్ను, బ్రోచర్లను ఆవిష్కరించారు.ఏలూరు డిపో నెంబర్ 7382907631, జంగారెడ్డిగూడెం 949101905,నూజి వీడు 9441010271కు సంప్రదించాలని ప్రయాణీకులకు సూచించారు.

About Author