విషపు నీటిని తాగి… 27 గొర్రెలు మృతి
1 min read– ఇటుకలబట్టి యజమాన్యం నిర్లక్ష్యంతోనే గొర్రెలు మృతి
– ప్రశ్నించిన గొర్రెల కాపర్లను నోటికి వచ్చినట్టు తిట్టిన వైనం
– మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఇటుకల బట్టీలు
– పట్టించుకోని అధికారులు
– దుమ్ము ధూళితో బెంబేలెత్తుతున్న గ్రామ ప్రజలు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు బుడ్డయపల్లె గ్రామ సమీపంలోని ఇటుకల బట్టి వద్ద బుధవారం ఉదయం కలుషిత నీరు తాగి 27 గొర్రెలు మృతి చెందాయి, పెండ్లి మర్రి మండలం ఓపరాస్ పల్లె గ్రామానికి చెందిన గంగిరెడ్డి, బాల గంగయ్య, వడ్డెరపు చిట్టిబాబు, వీరాంజనేయులు, గంగరాజు, ప్రసాదు లు తమకు సంబంధించిన గొర్రెలను చెన్నూరు చుట్టుపక్కల పొలాలలో మేపుకొనుటకు రావడం జరిగింది, రోజులాగే అక్కడ వారు గొర్రెలను మేపుకొనుచుండగా కొన్ని గొర్రెలు పక్కనే ఉన్న ఇటుకల బట్టి వద్ద నీటిని తాగగా తాగిన గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది, గమనించిన గొర్రెల కాపర్లు ఇటుకల బట్టి యజమానిని తొట్టిలో ఉన్న నీటి లో ఏమి కలిపావని నీరు తాగిన మా గొర్రెలు చనిపోవడం జరిగిందని అడుగగా, అతను వారిపై దుర్భాషలాడుతూ నీటిలో యూరియా కలిపానని గొర్రెలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని వారిపై దుర్భాషలాడుతూ గొడవకు దిగారని గొర్రెల కాపర్లు తెలిపారు, నా బట్టి నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా మీరు గొర్రెలను ఇక్కడికి తీసుకు రావడమే తప్పని ఇటుకుల బట్టి యజమాని భాష వారిపై ఇష్టానుసారంగ తిట్టడం జరిగిందని వారు వాపోయారు, నోరులేని గొర్రెలు అసలే మండుటెండలు దాహానికి తట్టుకోలేక అక్కడికి వచ్చి నీరు తాగాయే తప్ప మేము కావాలని గొర్రెలను వదల లేదని చెప్పిన అతను వినకుండా ఇష్టానుసారం తిడుతూ వారిపై కొట్టడానికి వెళ్లాడని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని అతను వారిని దబాయించడం జరిగిందన్నారు, ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీచీర్ల సురేష్ యాదవ్ సంఘటన స్థలానికి వెళ్లి గొర్రెల కాపరులను ఓదార్చి విషయాన్ని పశువుల డాక్టర్ ఉపేంద్ర కు, అలాగే వీఆర్వో వెంకటసుబ్బయ్యకు విషయాన్ని తెలియజేశారు, వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన గొర్రెలను పరిశీలించడం జరిగింది, అలాగే ఎంపీపీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి గొర్రెల కాపర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు, అలాగే ఎంతమంది కాపర్లు ఉన్నారు ఎవరెవరి గొర్రెలు ఎన్ని ఎన్ని మృతి చెందాయో పూర్తి వివరాలు సేకరించడం జరిగింది, అలాగే ఇటుకుల బట్టి వద్దకు వెళ్ళగా అప్పటికే అతను అక్కడి నుండి వెళ్లిపోవడం జరిగిందని పోలీసులు తెలిపారు, వెటర్నరీ డాక్టర్ ఉపేంద్ర గొర్రెల కాపరులతో మాట్లాడుతూ, ఇంకా ఏవైనా గొర్రెలు కలుషిత నీరు తాగినట్లయితే ఆ గొర్రెలను మందనుండి వేరు చేసి వాటికి సరైన చికిత్స అందించడం, అదేవిధంగా చనిపోయిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించి తగిన నమూనాలను ల్యాబ్ కు పంపించడం జరుగుతుందన్నారు అవి యూరియా వల్ల చనిపోయాయా లేదా, గుళికలు ఆ నీటిలో కలపడం వల్ల చనిపోయాయా వంటి విషయాలను తెలుసుకోవడం జరుగుతుందని ఆయన గొర్రెల కాపర్లకు తెలపడం జరిగింది, అదేవిధంగా ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ తెలిపిన విధంగా ఈ విషయాలన్నీ కూడా నిర్ధారించుకోవడం జరుగుతుందని, అలాగే పశు వైద్య ఉన్నతాధికారులకు అటు ఎంపీపీ ఇటు మేము కూడా ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని ఆయన తెలిపారు, అనంతరం రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, రామనపల్లి ఉప సర్పంచ్ పుత్తా వేణుగోపాల్ రెడ్డి, మృతి చెందిన గొర్రెలను పరిశీలించి, గొర్రెల కాపరులతో మాట్లాడారు, చనిపోయిన గొర్రెల కాపర్లు గంగిరెడ్డి కి చెందిన ఐదు గొర్రెలు, బాల గంగయ్య కు చెందిన 8 గొర్రెలు, గంగరాజు చెందిన5 గొర్రెలు, ప్రసాద్ కు సంబంధించి 3 గొర్రెలు వడ్డేపు చిట్టి బాబుకు సంబంధించి మూడు గొర్రెలు, వీరాంజనేయులు కు సంబంధించి మూడు గొర్రెలు మృతి చెందినట్లు వారు తెలిపారు..-నిబంధన నిబంధనలకు పాతర ఇష్టానుసారంగా ఇటుకల బట్టీలు….చెన్నూరు టౌన్ జాతీయ రహదారికి ఇరువైపులా ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా ఇటుకల బట్టిలు ఏర్పాటు చేయడంతో పక్కనే ఉన్న గ్రామాల పైన దుమ్ము ధూళి పడడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంన్నదని అక్కడి ప్రజలు వాపోతున్నారు, అంతేకాకుండా జాతీయ రహదారిపైన ఇటుకల బట్టి లు ఉన్నచోట మట్టి పేరుకు పోయి చిన్న వర్షం వచ్చిన బాటసారులు, అలాగే ద్విచక్ర వాహనదారులు జారి కింద పడడం, కాళ్లు చేతులు తిరగడం తో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు, ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు అక్కడి ప్రజలు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా జాతీయ రహదారికి, అలాగే గ్రామాలకు దగ్గరగా ఉన్న ఇటుకల బట్టీల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అలాగే నిబంధనలు పాటించని ఇటుకల బట్టీలు తొలగించాలని అధికారులను కోరినట్లు అక్కడి ప్రజలు తెలిపారు.