రూ.61 లక్షలతో… 2డి ఎకో పరికరం…
1 min read
గుండె పరీక్షలకు సంబంధించిన అత్యాధునిక పరికరం
- త్వరలో మంత్రి టిజి భరత్ చేతుల మీదుగా ప్రారంభం
- కర్నూలు జీజీ హెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు
- మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ చిట్టి నర్సమ్మకు కృతజ్ఞతలు తెలిపిన
- కార్డియాలజి ప్రొఫెసర్ డా. చంద్ర శేఖర్
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో పేదల గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు మెరుగుగా అందుతున్నాయని, మరిన్ని అత్యాధునిక పరికరాలు ఉంటే ఎంతో సేవ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు జీజీ హెచ్ సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు. సర్వజన ఆస్పత్రిలోని కార్డియాలజి విభాగంలో శనివారం ప్రొఫెసర్ డా. చంద్ర శేఖర్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా. చిట్టి నర్సమ్మ పాల్గొని మాట్లాడారు. రాయలసీమతోపాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే పేదలకు గుండె పరీక్షల సమయంలో బయట రాస్తే ఇబ్బంది అవుతుందని , అందుకే కాలేజ్ డెవలప్ మెంట్ సొసైటీ (సి.డి.ఎస్) నిధుల ద్వారా రూ.61 లక్షలతో 2డి ఎకో పరికరం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఆ తరువాత కార్డియాలజి ప్రొఫెసర్ డా. చంద్ర శేఖర్ మాట్లాడుతూ కార్డియాలజి విభాగంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో సిబ్బంది కిరణ్, ప్రశాంత్ తదితరుల కృషి అభినందనీయమన్నారు. గుండెకు సంబంధించిన ఆంజియెగ్రామ్, ఇతర పరీక్షలు చేసేందుకు అంందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతం 2 డి ఎకో పరికరం అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ చేతుల మీదుగా పరికరంను ప్రారంభిస్తామని పేర్కొన్న ప్రొఫెసర్ డా. చంద్ర శేఖర్… సిడిఎస్ నిధులతో 2డి ఎకో పరికరం అందజేసిన మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా. చిట్టి నర్సమ్మకు కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో కార్డియాలజి విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
