NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పొదుపు మహిళలకు 3 కోట్ల 72 లక్షల చెక్కు అందజేత

1 min read

ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి   

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: వైయస్సార్ ఆసరా నాలుగవ విడత కింద పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు బాసటగా ఉంటూ నాలుగవ విడత కింద లబ్ధి పొందిన అక్క చెల్లెమ్మలకు 78.94 లక్షల లబ్ధిదారులకు 6,394.83 కోట్ల రూపాయలను నిధులను స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అమ్మ విడుదల చేశారు..అందులో భాగంగా పత్తికొండ టిటిడి కళ్యాణ మండపం నందు నాలుగో విడత ఆసరా క్రింద విడుదలైన 719 సంఘాలకు, 6994 సభ్యులకు నాలుగో విడత కింద విడుదలైన 3.72 కోట్ల చెక్ ను ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం 2019 ఎన్నికల కంటే ముందు పొదుపు మహిళలకు 25,571 కోట్ల అప్పును అధికారులకు రాగానే నాలుగు దఫాలుగా విడుదల చేస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నేడు నెరవేరుస్తూ అక్కచెల్లెమ్మలకు ఆసరా నిలబడడం  జరిగిందని అన్నారు.. పొదుపు సంఘాల మహిళలు ఆనందంతో కేక్ కట్ చేసి జగనన్నకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో,ఎంపీడీవో, వెలుగు ఏపీఎం,అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు,వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకులు జడ్పిటిసి,ఎంపీపీ,మండల కన్వీనర్,వైస్ ఏంపిపిలు, ఎంపిటిసి సభ్యులు,సర్పంచులు, వార్డు మెంబర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author