కురువలకు 3 ఎంపీ, 15 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి
1 min readగుడిసె శివన్న, కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
పల్లెవెలుగు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 లక్షల కురువ ఓటర్లు ఉన్నారు, వారికి తగ్గట్టు 15 అసెంబ్లీ ,3 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న డిమాండ్ చేశారు . రాష్ట్రంలో మూడు కోట్ల 99 లక్షల 86 వేల 868 మంది ఓటర్లు ఉన్నారని అందుకు తగ్గట్టుగా తమ కులానికి కురువలకు 15 ఎమ్మెల్యేలు, మూడు ఎంపీ స్థానాలు ప్రధాన పార్టీలు కేటాయించాలని లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని, జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించకపోతే మేము సహకరించే ప్రసక్తే లేదని గుడిసె శివన్న అన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో మాకు రావాల్సిన సీట్లను ఇతరులకు కేటాయించి కురువ కులస్థులను ఓట్లు వేసే యంత్రాలుగా వాడు కోంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు . గతంలో రాష్ట్రమంతా కలిపి కురువలకు తెలుగుదేశం పార్టీ ఒక సీటు కేటాయించింది. వైఎస్ఆర్సిపి రెండు ఎమ్మెల్యేలు,ఒక ఎంపీ కేటాయించింది .కానీ మాకు రావాల్సింది 15 ఎమ్మెల్యేలు, మూడు ఎంపీలు జనాభా ప్రాతిపదికన మాకు సీట్లు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా కురువలందరు ఏకతాటిపై నడవాలని నిర్ణయం తీసుకుంటామని మాకు సహకరించని పార్టీలకు ఓటు రూపంలో బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు . గొర్రెల కాపర్లమైన మేము మాకు రావలసిన పథకాలను ,రాష్ట్ర గొర్రెల సహకార సంఘం చైర్మన్ పదవి ఏ పార్టీ కేటాయిస్తుందో ఆ పార్టీకి కురువల సహకారం పూర్తిస్థాయిలో ఉంటుందని తెలిపారు . గతంలో మాకు హామీ ఇచ్చి మోసం చేసిన పార్టీ కూడా ఉందని, ఈసారి అలాంటి పప్పులేం ఉడకవని గుడిసె శివన్న అన్నారు. కురువలకు మదాసి కురువ సర్టిఫికెట్ల విషయంలో కూడా మోసం జరిగిందని ,గత 70 ఏళ్లుగా మేము మోసపోతూనే ఉన్నామని, మేము మా పూర్వీకులు సంచార జాతుల వారం కాబట్టి మాకు చదువు లేకపోవడంతో మాకు ఇవ్వాల్సిన సర్టిఫికేట్ కాకుండా వేరే సర్టిఫికెట్లు ఇచ్చి ఇప్పుడు మీ దగ్గర ఆ సర్టిఫికేట్ ఉంటే మీ అందరికీ ఇస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. దీనిపై కూడా ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి మాకు రావాల్సిన కుల సర్టిఫికెట్లు మంజూరు చేయాలని అలాగే రాష్ట్ర విభజనలో తెలంగాణలో ఉన్న మా ఆస్తులు పంపకం జరగలేదని దాన్ని కూడా మాకు పరిష్కరించి ఇవ్వాలని గుడిసె శివన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొర్రెలకు ఇన్సూరెన్స్, గొర్రెలు మేపుకోవడానికి ప్రభుత్వ భూములు కేటాయించాలి .అలాగే గొర్రెల సంఘాలకు 90 శాతం సబ్సిడీపై లోన్లు ఇవ్వాలి. మా పిల్లల చదువులకు ప్రత్యేకమైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. గొర్రెల కాపరులపై దాడి చేసిన వారిపై సుమెటాగా పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలన్నారు విదేశాల్లో చదివే విద్యార్థులకు చదువుకు అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరించాలని గుడిసె శివన్న డిమాండ్ చేశారు.