30 సంచుల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
1 min readపల్లెవెలుగు వెబ్, వెలుగోడు: మండలంలోని గుంతకందాలలోని ఓ ఇంటిపై దాడి చేసి భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, సెబ్ సీఐ రాజారాం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాబడిన సమాచారం మేరకు … బుధవారం గుంతకందాలలో కిరాణ వ్యాపారం చేస్తున్న బచ్చు రాము అనే వ్యక్తి ఇంటిని తనిఖీ చేయగా 30 సంచుల గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ. 3లక్షల 2వేల 390 ఉంటుందని ఎస్క్ష్మ చిన్న పీరయ్య యాదవ్ వెల్లడించారు. గుట్కాలను నంద్యాలలో ని మజ్జిగ భాష , శేఖర్ ల నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు ముద్దాయి రాము అంగీకరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పీరయ్య యాదవ్ తెలిపారు.