ఘోర రైలు ప్రమాదం.. 30 మంది మృతి
1 min readపల్లెవెలుగు వెబ్: పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దక్షిణ పాక్ లోని ఘోత్కిలోని రెతి-దహర్కి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ప్రయాణీకులతో వెళ్తున్న రెండు రైళ్లు ఢీకొనడంతో 30 మంది ప్రయాణీకులు మరణించారు. లాహోర్ వైపు వెళ్తున్న సర్ సయ్యద్ ఎక్స్ ప్రెస్, కరాచీ నుంచి సర్గోధా వెళ్తున్న మిల్లత్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మిల్లత్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 13 నుంచి 14 భోగీలు పట్టాలు తప్పాయని, 8 బోగీలు ధ్వంసం అయ్యాయని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. బోగీల మధ్య ఇరుక్కున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.